రథోత్సవంలో విద్యుత్ లైన్లను పరిశీలించిన డిఈ శ్రీధర్
Trinethram News : ఆలమూరు. ఆలమూరు నవ జనార్ధన స్వామి కళ్యాణోత్సవాలలో భాగంగా భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలమూరు లో జరిగే జనార్ధన స్వామి రథోత్సవం సందర్భంగా విద్యుత్ లైన్లు తొలగింపు కార్యక్రమాలను ట్రాన్స్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ శ్రీధర్ శనివారం ఆలమూరులో పర్యటించారు. ఆలమూరు జనార్ధన స్వామి ఆలయం నుండి మెయిన్ రోడ్ లోని జొన్నాడ ఎస్ టర్నింగ్ వరకు ఉన్న విద్యుత్ లైన్లు పైఉన్న వినియోగదారుల కనెక్షన్లను తొలగించే కార్యక్రమం ఆలమూరు ట్రాన్స్కో ఏఈ ప్రసాద్, లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, లైన్మెన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతుంది.
విద్యుత్ లైన్ తొలగించి రథం వెళ్లిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించే కార్యక్రమం పై డిఈ శ్రీధర్ స్థానిక ట్రాన్స్కో అధికారులు సిబ్బందితో సంప్రదించారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచనలు అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App