TRINETHRAM NEWS

DCP conducted counseling for four persons who were caught consuming ganja in the presence of their family members

మంచి నడవడికతో జీవనం సాగించాలి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జిల్లా ను గంజాయి రహిత జిల్లా గా తీర్చి దిద్దుటకు యం.శ్రీనివాస్, ఐ.పి.యస్.,(ఐ.జి.పి.) కమిషనర్ ఆప్ పోలీస్, రామగుండం ఆదేశాల మేరకు ఎగ్గడి భాస్కర్ డి.సి.పి., మంచిర్యాల మంచిర్యాల జిల్లా లో స్పెషల్ టీం ను స్థాపించడం జరిగినది. ఇట్టి టీం జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ గంజాయి రవాణా మరియు అమ్మకం పై ప్రత్యేక నిఘా ఉంచి, నేరస్థుల ను పట్టుకొని గంజాయి రవాణా ను నిరోధించుటకు కృషి చేస్తుంది.

దానిలో భాగంగా మందమర్రి లో గంజాయి తాగుతూ పట్టుబడిన నలుగురు యువకులలో ఒకరు ఐ.టి.ఐ. చదువు పూర్తి చేసుకొని సింగరేణి లో ఉద్యోగం చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి ఐ.టి.ఐ., చదువుచున్నాడు, మిగతా ఇద్దరు యువకులు కూడా పెయింటింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నందున, వారి భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షములో కౌన్సిలింగ్ నిర్వహించి అట్టి యువకులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించు చున్న డి-అడిక్షన్ సెంటర్ లో చికిత్స గురించి చేర్చడం జరిగినది.

మంచిర్యాల జిల్లా ప్రజలకు, మంచిర్యాల జోన్ పోలీస్ వారి తరపున విన్నపం ఏమంటే మీ కుటుంబ సభ్యులలో గాని, బంధువులలో గాని, పరిచయస్తులలో గాని ఎవరైనా గంజాయికి అలవాటు పడినట్లు అనుమానము వస్తే పోలీస్ వారికి తెలుపండి, మీ పేర్లు గోప్యంగా ఉంచబడుతాయి. అట్టి వ్యక్తుల మీద కేసులు నమోదు చేయకుండా వారికి వైద్య పరంగా సహకారం అంధించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాడానికి పోలీస్ శాఖ తరుపున మా శాయశక్తుల ప్రయత్నిస్తాము అని డీసీపీ అన్నారు.

యువత కూడా గమనించవలసిన విషయం ఏమంటే, తమ పై పోలీస్ కేసులు నమోదు అయితే, భవిష్యత్తు లో ఉద్యోగాలు రావు, ఎవరు పనిలో పెట్టుకోరు, బంధువులు దరి చేరనీయరు, ఆరోగ్యం పాడవుతుంది, తల్లి తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం చెడు వ్యసనాలకు ఖర్చు అవుతుంది. భవిష్యత్తు అంధకారం అవుతుంది. కావున ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, మంచి నడవడికతో జీవనం సాగించాలని డీసీపీ సూచించడమైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

DCP conducted counseling for four persons who were caught consuming ganja in the presence of their family members