దావోస్ పర్యటన…సిఎం చంద్రబాబు ప్రెస్ మీట్ హైలెట్స్
Trinethram News : Andhra Pradesh : దావోస్ అనేది నాకు కొత్త కాదు.. దావోస్‌కు వెళ్లాలని ట్రెండ్ సెట్ చేసింది నేనే.
మొట్టమొదటి సారిగా 1995 ముఖ్యమంత్రి అయ్యాక.. 1997 నుంచి దావోస్‌కు వెళ్లినట్లు తెలిపారు.
అప్పట్లో హైదరాబాద్ అని అంటే ఏ హైదరాబాద్ అని.. పాకిస్థాన్‌లో ఉండే హైదరాబాద్ గురించా అని అడిగేవారు.
భవిష్యత్ అంతా గ్రీన్ ఇండస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రకృతి వ్యవసాయంకు భవిష్యత్‌లో బాగా ప్రాధాన్యత.
ఏపీలో ఇప్పుడు 10 లక్షల మంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.
ప్రతి మీటింగ్‌లో నేను, లోకేష్ ప్రతీ వేదికపై ఏపీని ప్రమోట్ చేశాం.
▪️మనం ఉద్యోగం అడగడం కాదు.. ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలి.
జూరిచ్ వెళ్ళినప్పుడు 500 మంది తెలుగు వాళ్ళు వచ్చారు. అందులో చాలా మంది కంపెనీలు పెట్టారు. 100 దేశాల్లో తెలుగువాళ్ళు ఉన్నారు.
సీఐఐతో కలిసి సింగపూరులోని ఐఎమ్‌బీని కలుపుకొని గ్లోబల్ లీడర్షిప్ సెంటర్‌ను ఏర్పాటు. అమరావతిలోనే ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం.
మోదీ నాయకత్వంలో 2028 నుంచి వృద్ధి రేటులో చైనాను అధిగమిస్తామని చంద్రబాబు అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App