TRINETHRAM NEWS

కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్‌ వారియర్

సైబర్ వారియర్ తో సైబర్‌ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సైబర్‌ నేరాల కట్టడిపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ( టీఎస్‌సీఎస్‌బీ) ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరేట్ లో ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజి పేర్కొన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రతి పోలీసు స్టేషన్‌లో ఉన్న సైబర్‌ వారియర్‌ సిబ్బంది కి పోలీసుస్టేషన్లలో నమోదయ్యే సైబర్‌ నేరాల దర్యాప్తును తీసుకోవాల్సిన చర్యలు పై క్రోసిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ సిపి దిశా నిర్దేశం చేయడం జరిగింది
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అనుకోని రీతిలో సైబర్ నేరానికి గురైతే ఖంగారు పడకుండా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. “సైబర్ వారియర్” అందుబాటులోకి వస్తారు. సైబర్ వారియర్స్ 1930 ఫోన్‌లో ఫిర్యాదులను స్వీకరించడం, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నిసీపీ లో నేరాన్ని నివేదించడం, అనుమానిత ఐడెంటిఫైయర్‌లను విశ్లేషించడం, అలాగే సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేయడం వంటి వాటిపై వారికి శిక్షణ, అవగాహనా కల్పించడం జరిగిందని పోలీస్ స్టేషన్‌, టీఎస్‌సీఎస్‌బీ మధ్య సైబర్‌ వారియర్లు సమన్వయ కర్తలుగా పని చేస్తారని సీపీ గారు తెలిపారు. శిక్షణ పొందిన వారు విధులు నిర్వహించే పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే సైబర్‌ నేరాల విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటారని అన్నారు.సైబర్ వారియర్స్ కి ప్రత్యేకంగా ఒక సెల్ ఫోన్, సిమ్ కార్డ్ ను అందజేశారు.

ప్రజలు సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 ఫోన్ నెంబర్ కు, ఎన్సీఆర్జీ పోర్టల్లో గాని, దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరం ద్వారా మోసపోయిన డబ్బును త్వరగా ఇప్పించే విధంగా నూతన పద్ధతిపై సైబర్ వారియర్స్ కు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇది వరకే సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నట్లయితే వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చేస్తారని అన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమని మల్టీలెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇతర ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు.

ఏ పోలీసు అధికారి నేరుగా వాట్సాప్ వీడియోకాల్స్ చేయరని, డిజిటల్ అరెస్టులు అని చేసేకాల్స్ వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలని సీపీ గారు సూచించారు. ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్ల బలంగా మారిందన్నారు. మారుతున్న టెక్నాలజీ, అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారని, అప్రమత్తంగా ఉంటేనే నష్టం జరగదన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో నష్టపోతే తక్షణం 1930లో ఫిర్యాదు చేయాలని సూచించారు, ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సిబ్బంది చిరంజీవి, నరేష్, కోటేష్ మరియు సైబర్ వారియర్స్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cyber ​​Warrior