TRINETHRAM NEWS

త్వరలో విశాఖ పట్నం నుంచి సింగపూర్ కి క్రూయిజ్ సేవలు

ప్రపంచ పర్యాటక రంగంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. చెన్నై నుంచి విశాఖ మీదగా సింగపూర్ క్రూయిజ్ సేవలు మార్చిలో ప్రారంభం కానున్నాయి.

ఇందుకోసం లిట్టోరల్ క్రూయిజ్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

భవిష్యత్ లో విశాఖ నుంచి థాయిలాండ్ ,మలేషియా శ్రీలంక ,మాల్దీవులు కు కూడా క్రూయిజ్ సేవలు అందుబాటు లోకి తెస్తామని అధికారులు వెల్లడించారు.