తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి :జనవరి 21
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు.
దీంతో శ్రీవారిని దర్శించుకోవాడినికి భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. స్వామివారికి దర్శించు కుంటూ భక్తులు మొక్కులు చెల్లించకుంటు న్నారు.
రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఏప్రిల్ నెల ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేయనున్నారు.
కాగా, శనివారం శ్రీవారి 69,874 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో నిన్న 26,034 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.