Trinethram News : మంచిర్యాల జిల్లా: మార్చి 09
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 80 ఎకరాల్లో వరి పంట నెర్రెలు బారింది. కొత్త కనెక్షన్ల కోసం డీడీలు తీసి 3 నెలలు గడుస్తున్న.. విద్యుత్ అధికారులు కనెక్షన్ ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి.. విద్యుత్ సరఫరా చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.