TRINETHRAM NEWS

కామ్రేడ్ భూపాల్ రాష్ట్ర కమిటీ సభ్యులు

సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం ఎరవెల్లి ముత్యం రావు అధ్యక్షులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని శ్రామిక భవన్లో జరిగింది, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థల కు ఏకకాలంలో ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించింది. ఇందులో ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. ఎందుకంటే మాజీ రాష్ట్రపతి నాయకత్వం వహించిన ఎన్డీఏ ప్రభుత్వ మద్దతుదారులతో కూడి ఉంది. మానస పుత్రిక ఒకే నాయకుడి సారధ్యంలో ఉండే. ఏకీకృత రర్పాటుచేయాలని అది కోరుకుంటుంది. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే నాయకుడు అన్న నినాదానికి ఇది కొన సాగింపు మాత్రమే. ఇది బీజేపీ యొక్క ఫాసిస్టు దృక్పథాన్ని తెలియజేస్తుంది. జమిలి ఎన్నికల వలన అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలిగించడాన్ని నివారిస్తుందన్న పసలేని వాదనలను బీజేపీ ముందుకు తెస్తోంది. 2024 పార్లమెంట్ కేటాయించిన సొమ్ము రూ.466 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా, సిబ్బంది తరలింపు తదితర అవసరాల కోసం మరికొంత సొమ్ము ఖర్చు చేసాయి. అన్నీ కలిపినా ఇది ఏమంత పెద్ద ఖర్చు కాదు. మిగిలిన సంవత్సరాలకు అయిన ఖర్చు ఇంత కన్నా చాలతక్కువ. ఇక అభివృద్ధి వరకూ వస్తే 1967 నుండి ఇప్పటీ వరకు తరుచుగా జరుగుతున్న అభివృద్ధిని నిరోధించినట్లు దాఖలాలు లేవు.
జమిలి ఎన్నికలు జరిపితే రెండు మౌలిక పునాదులైన ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానాలు దెబ్బతింటాయి. రాజ్యాంగ సవరణ పార్లమెంట్కు లేదని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటినుండి ఈ ఆలోచనను ముందుకు తేవడమే గాక జమిలి ఎన్నికలనేవి ఇక ఏమాత్రం చర్చ నీయాంశం కాదని అవి దేశానికి అత్యంత ఆవశ్యకమైనవని 2020లో ప్రకటించారు. శాసనసభల ఎన్నికల కపరిమితి ఎటు దారితీస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి శాసనసభ రద్దు చేయాల్సి వస్తే మిగిలిన కాలానికి మాత్రమే మధ్యంతర ఎన్నిక నిర్వహించబడుతుంది. రాజ్యాంగంలో, ప్రజలు ఐదేళ్ల కాలానికి తమ ప్రతి నిధుల్ని ఎన్నుకునే హక్కు పొందుపరచబడింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనలపై కోవింద్ సిఫార్సు ల వలన ఈ హక్కు ఉల్లంఘనకు గురవుతుంది. ఇంతేగాక మధ్యంతర ఎన్నిక జరగాలన్న సిఫార్సు, పలుమార్లు ఎన్నికలు వీరి ప్రతిపాదనను వ్యతిరేకిస్తుంది. మధ్యంతర ప్రభుత్వ కాలపరిమితి ముగిసిన తర్వాత మరో ఎన్నిక నిర్వహించాల్సిందే పంచాయితీలు, మున్సిపాలిటీలకు ఏకకాలంలో ఎన్నికల విధానంపై దాడి మరింత స్పష్టం అవుతుంది. ఇది ఒక పగతో కూడిన కేంద్రీకరణ. నిర్ణయాలు చేసే అధికార వికేంద్రీకరణ మౌలిక ఉద్దేశానికి ఇది విరుద్ధమైనది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం. జమిలి ఎన్నికల ప్రతిపాదన ద్వారా దాడి కి గురువుతుంది.

“శాల వైవిధ్యం రీత్యా ఈ ప్రతిపాదన చాలా అసంబధ్ధమైనది. లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే, రాజ్యాంగంలోని అనేక అంశాలను సమూలంగా సవరించాల్సి ఉంటుంది. సవరించాల్సిన అధికరణలు: అధికరణ 83 (లోక్ సభ యొక్క కాలపరిమితి), అధికరణ 85 (లోక్ సభ రద్దు), అధికరణ 172 174 (శాసనసభల రద్దు) 356 (రాజ్యాంగ యంత్ర వైఫల్యం) సవరణలు చెయ్యాలి. అందువలన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడం ద్వారా జమిలి ఎన్నికలు తేవాలన్న కృత్రిమ ప్రయత్నాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) పూర్తిగా యతిరేకిస్తోంది. ప్రజాస్వామ్యం, బహుళత్వం, సమాఖ్య విధానాన్ని కోరుకునే ప్రతీ పార్టీ దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ ముందుకు రావాల ఈ దుష్ట ప్రతిపాదనను ఐక్యంగా పోరాటం చేయాలి. ప్రజాస్వామ్య వ్యతిరేక, సమాఖ్య వ్యతిరేకమైన ఈ ప్రతిపాదనను భారతదేశ ప్రజానీకమంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి వై యాకయ్య, కార్యదర్శివర్గ సభ్యులు ఏ ముత్యంరావు, ఏ మహేశ్వరి, యం రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు మండే శ్రీనివాస్, ఎన్ శంకర్, రవీందర్, పాల్గొన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App