TRINETHRAM NEWS

బోగిమంటల్లో పెంచిన విద్యుత్తు బిల్లులు సీపీఎం నాయకుల విన్నూత్న నిరసన

అల్లూరి జిల్లా అరకులోయ:త్రినేత్రం న్యూస్!! జనవరి: 14

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం పద్మాపురం గ్రామపంచాయతీ ఎండపల్లి వలస గ్రామం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ చార్జీలు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఈరోజు ఎండపల్లి వలస గ్రామంలో విద్యుత్ బిల్లులను భోగిమంటల్లో దహనం చేస్తూ, నిరసన తెలపడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, పాల్గొని గిరిజన ప్రాంతాల్లో అందరికీ కూడా సబ్సిడీ ద్వారానే విద్యుత్ అందించాలని, అలానే ఆదివాసి ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఆదివాసి కుటుంబానికి, ఉచిత విద్యుత్ అందించాలని, తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె రామారావు, ఎండపల్లి వలస రెవిన్యూ విలేజ్ పిసా కమిటీ ఉపాధ్యక్షులు. కిల్లో మహేష్ ,వార్డు సభ్యులు పాడి రవి, మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App