
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ ప్రధాన కార్యాలయంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి నేరుగా ఫిర్యాదుదారుల వద్దకు వచ్చి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది.
రామగుండం కమీషనరేట్ పరిధిలోనీ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తు లను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్ఐ మరియు సిఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా రామగుండం కమీషనరేట్ పోలీస్ శాఖ పని చేస్తుందని రామగుండం పోలీస్ కమీషనర్ తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
