TRINETHRAM NEWS

చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలు కు పంపిస్తాం

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్ లో పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు. సీపీ కాలనీ ప్రజలతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదైనా సమస్య విషయంలో డయాల్ 100 కాల్ కాని, స్థానిక పోలీసు వారికి సమస్య తెలిపినప్పుడు, సమాచారం అందించినప్పుడు మంచిర్యాల పట్టణ పోలీస్ వారు ఎలా ప్రతిస్పందిస్తున్నారని, భద్రత పరమైన విషయాలపై, పోలీసుల పనితీరుపై అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ ప్రాంతంలోని రౌడీషీటర్స్, సస్పెక్ట్ షీట్స్ లకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రస్తుత పరిస్థితి, జీవన విధానం ను అడిగి తెలుసుకుని ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా పై నిఘా, నియంత్రణలో భాగంగా తిలక్ నగర్ లోని అనుమానస్పద ప్రాంతాలను మరియు ఇండ్లను,ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు నిర్వహించడం జరిగింది. వాహనాలను పరిశీలించారు
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ చట్ట ప్రకారం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవించే ప్రజలకు పోలీస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. వారికీ సహాయ సహకారం అందిస్తాం వారికీ అండగా ఉంటాం అన్నారు. అదేవిదంగా చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు అని అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని సిపి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ మంచిర్యాల ఏ సి పి ఆర్ ప్రకాష్ మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్, మంచిర్యాల రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CP participated in Tilak