CP held review meeting on pending cases
రామగుండం పోలీస్ కమిషనరేట్
పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీపీ
ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి
నేరాలు తగ్గేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి
నేరాల చేదనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని
వినియోగించుకోవాలని
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీసు కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి గారు అన్నారు. రామగుండం పోలీసు కమిషన రేట్ పరిధి పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసు అధికారులతో కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్థులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోక్సో కేసు లతో పాటు ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేసిన కేసులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల పురోగతిపై ఆడిగి తెలుసుకున్నారు. విచారణ వెంటనే పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. నిందితులకు శిక్ష పడేవిధంగా విచారణలో నాణ్యత ప్రమాణాలు పాటిం చాలని సూచించారు. శాస్త్రీయ పరిశోధన ద్వారా కేసులను సమగ్రంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని, విచారణలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం పనికిరాదన్నారు
ఈ సమావేశంలో అడిషనల్ డీజీపీ అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ, సిసిఎస్ ఏసిపి వెంకటస్వామి, సిసి అర్బీ ఇన్స్పెక్టర్ స్వామి, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, పెద్దపెల్లి సబ్ డివిజన్ కు సంబంధించిన సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App