Counseling by experts to Eve Teasers under Women Safety Wing through Zoom Meeting
జూమ్ మీటింగ్ ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్స్ కు నిపుణుల చే కౌన్సెలింగ్
స్త్రీలు, విద్యార్ధినిల పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలి ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు తప్పవు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి ) ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్త్రీల రక్షణ కోసం 24 గంటలు మహిళా నేస్తంగా పనిచేస్తున్నటువంటి షీ టీమ్స్ గత మూడు నెలల కాలంలో అమ్మాయిలను వేధింపులకు గురిచేసిన ఈవ్ టీజర్స్ ( ఆకతాయిలు) మరియు వేధింపులకు గురి చేస్తూ షి టీమ్స్ కు ప్రత్యక్షంగా పట్టుబడిన ఈవ్ టీజర్స్ మొత్తం 42 మందిని పిలిపించి వారికీ ఈరోజు అనగా తేదీ:28-06-2024 న రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని కాన్ఫరెన్స్ హల్ నందు మహిళా భద్రతా విభాగం(ఉమెన్ సేఫ్టీ వింగ్) హైదరాబాద్ కు చెందిన నిపుణులచే నిర్వహించిన జూమ్ మీటింగ్ ద్వారా ఆన్లైన్ లో కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కౌన్సెలింగ్ కార్యక్రమం లో మహిళలను ఎలా గౌరవించాలి, వారి పట్ల ప్రవర్తించవలసిన తీరు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినట్లయితే చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలకు గురి అవుతారు, సమాజంలో మహిళలను గౌరవిస్తూ బాధ్యత గల పౌరునిగా ఎలా జీవించాలి మొదలగు ఈ విషయాల పై వారికి అవగాహనా కల్పించడం జరిగింది.
ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు.
స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, సిసి ఆర్ బి ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, మహిళా పోలీసు స్టేషన్ శ్రీరాంపూర్ సిఐ రాజమౌళి గౌడ్, పెద్దపల్లి షి టీమ్ ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ మరియు షి టీమ్ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App