Councilor Bhukya Srinivas for Nutrition Abhiyan Masotsavalu in 11th Ward
భద్రాద్రి కొత్తగూడెం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అర్బన్ కొత్తగూడెం మున్సిపాలిటీ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు 11వ వార్డులోని చిటిరామారం తండా అంగన్వాడి వన్ టు సెంటర్లో ఏర్పాటుచేసిన పోషణ అభియాన్ లో *అంగన్వాడి సూపర్వైజర్ పార్వతి,11వ వార్డు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ పాల్గొని
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోషణ మాసంలో భాగంలో ఆరోగ్యలక్ష్మి గర్భిణీలకు బాలింతలకు అంగన్వాడీ అందించే పౌష్టిక ఆహారం తిని బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలా చూడాలని అన్నారు. అంగన్వాడి సెంటర్లో పిల్లలను బరువు తీసినప్పుడు వాళ్లు ఎత్తుకు తగ్గ బరువు లేకపోయినా బరువుకు తగ్గ ఎత్తి లేకపోయినా పిల్లలు శ్యామ్, మ్యామ్ లోకి వస్తారు కాబట్టి గర్భిణీగా ఉన్నప్పుడు అంగన్వాడి సెంటర్లో ఒక పూట సంపూర్ణ భోజనం గ్రుడ్డు, పాలు, కూరగాయలతో, భోజనం తల్లి బిడ్డల ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలని అన్నారు గర్భిణీ బాలింత తల్లి బిడ్డల తల్లులకు వాళ్లకు వచ్చే అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పౌష్టికాహారం దాని లోపం వల్ల జరిగే నష్టాలను మహిళలను వివరించి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే రక్తహీనత ఇతర సమస్యల నుండి తల్లి బిడ్డలు మహిళలకు వివరించి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యకరమైన రక్షణ పొంది పరిణితి పొందుతారని వారు అన్నారు. ఏ ఆహారం పదార్థాలు వీటి ద్వారా ప్రోటీన్లు దొరుకుతాయో ఆకుకూరల ద్వారా ప్రోటీన్లు దొరుకుతాయి చిరుధాన్యాల ద్వారా పోషకాలు పొందుతారు వాటిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు *అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి, తులసి బాయ్, ఆయాలు మీనా కళ్యాణి, తల్లి బిడ్డలు, గర్భిణీలు, బాలింతలు మహిళలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App