47 వ డివిజన్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా చేసిన కార్పొరేటర్ రామకృష్ణ
గౌరవనీయులు నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ P.అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 47వ డివిజన్ 47/3 సచివాలయం పరిధిలోని జండా వీధి వాటర్ ట్యాంక్ నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు,వాలంటీర్లు సచివాలయం సిబ్బంది,కన్వీనర్లు, తో మీటింగ్ ఏర్పాటు చేసుకొని జగనన్న ప్రభుత్వం లో నాలుగేళ్లలో సచివాలయం తరుపున ప్రజలకి అందిన పథకాలు DBT ద్వారా 9,79,81,807 మరియు Non DBT ద్వారా 3,52,39,119 మొత్తం 13,32,20,926 రూపాయలు డిస్ప్లే బోర్డు రూపంలో ప్రజలకి వివరించిన 47 డివిజన్ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ అలాగే జండా వీధి వాటర్ ట్యాంక్ సెంటర్ నందు వైఎస్ఆర్సిపి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్,46 డివిజన్ కార్పొరేటర్ JCS కన్వీనర్ వేలూరు మహేష్ 44 డివిజన్ కార్పొరేటర్ N.రాఘవ, శ్రీ తల్పగిరి రంగనాథ దేవస్థానం చైర్మన్ ఇలపక శివ కుమార్ ఆచారి,జిల్లా విశ్వబ్రాహ్మణ సేవ సంఘ అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య, సచివాలయం సిబ్బంది, కన్వీనర్లు గృహ సారధులు మరియు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.