TRINETHRAM NEWS

రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా…

కోవిడ్ 19 వైరస్ ప్రభావం మళ్లీ రాష్ట్రంలో పెరుగుతోంది. పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల కేసుల సంఖ్య గోప్యంగా ఉంటోంది.

వైరస్ లక్షణాలు కనిపించిన తర్వాత జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీంతో వాస్తవ కేసుల సంఖ్య తెలియడం లేదు..

అనధికారికంగా కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్న వారు, ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ వాస్తవ పరిస్ధితి అర్ధం కావడం లేదు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా కోవిడ్ పరీక్షలు ప్రారంభించాలని జనం కోరుతున్నారు. ..

ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దులతో పాటు విమానాశ్రయాలు, బస్టాండ్లలోనూ కోవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. ప్రభుత్వం సాధారణ అలర్ట్ ఇచ్చి వదిలేసింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కోవిడ్ సోకిన వారు కుప్పలు తెప్పలుగా రాష్ట్రంలోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీరి వల్ల రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, కాంటాక్టులకు వైరస్ సోకుతోంది. దీని ప్రభావం తెలియాలంటే మరో వారం రోజులుగా ఆగాలని డాక్టర్లు చెబుతున్నారు…