TRINETHRAM NEWS

Controversies are revolutionary decisions- Five years of Jagan’s government– Exactly this day he took oath as CM

Trinethram News : YSRCP News: ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అదే స్థాయిలో వివాదాలు ముసురుకున్నాయి. మూడు సంచలనాలు ఆరు వివాదాలు అన్నట్టు సాగిన పాలన ప్రారంభైంది ఇదే రోజు..

2019 మే 30న విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేసిన నేటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తి అయ్యాయి. 2019 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధించి దేశమంతా ఆంధ్రప్రదేశ్‌వైపు చూసేలా చేశారు.

50 శాతానికిపైగా ఓటు శాతంతో 151 ఎమ్మల్యే సీట్లు, 22 లోక్‌సభ స్థానాల్లో ఫ్యాన్ గిరగిరా తిరిగింది.

జగన్ ప్రభంజనంలో తెలుగుదేశం 23 అసెంబ్లీ సీట్లు, కేవలం మూడంటే మూడే లోక్‌సభ స్థానాలతో ప్రాణాలు నిలుపుకోగా… ఒక్కస్థానంతో సరిపెట్టుకుంది. రెండు జాతీయ పార్టీలకు డిపాజిట్లు కూడా రాలేదు.

ఒక్క ఛాన్స్ అంటూ జగన్ చేసిన ప్రచారం, నవ రత్నాలు పేరుతో తీసుకొచ్చిన మేనిఫెస్టో ప్రజలను బాగా ఆకర్షించింది. అప్పటి వరకు ఆఖరిలో అప్పటి

టీడీపీ ప్రభుత్వం పింఛన్లు పెంచినా, నిరుద్యోగ భృతి ఇచ్చినా, పసుపుకుంకమ పేరుతో మహిళలకు వరాలు ప్రకటించినప్పటికీ వైసీపీ విన్నింగ్ స్పీడ్‌ను ఆపలేకపోయింది.

23 ఎమ్మల్యే, 3 ఎంపీ స్థానాలతో టీడీపీ బిక్కచచ్చిపోతే… లోకేష్‌ పరాజయం, పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం ఆ పార్టీలను మరింత కుంగదీసింది.

ఈ ఫ్యాన్ హోరుగాలిలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Controversies are revolutionary decisions- Five years of Jagan's government- Exactly this day he took oath as CM