కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి అధికారుల బానిసలు కాదు
బెదిరింపులతో భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికారుల వైఖరి ఖండిస్తున్నాం.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి లో కాంట్రాక్ట్ కార్మికుల పట్ల అధికారుల వైఖరి రోజు రోజుకీ కక్షపూరితంగా ఉన్నది. కాంట్రాక్టు కార్మికుల అంటే కట్టు బానిసలుగా చూస్తున్న నేపథ్యం కొనసాగుతున్నది. కాంట్రాక్ట్ కార్మికుల మూలంగానే లాభాలు వస్తున్నాయని విషయాన్ని మరిచి కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగ భద్రత లేకుండా చేయాలని అధికారులు అనేక కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నించే వారినీ, నిలదీసే వారిని కక్షపూరితంగా వ్యవహరించడం పనుల నుండి తొలగించడం, పని ప్రదేశాలు మార్చడం ముఖ్యంగా మహిళా కార్మికులను తీవ్ర వేధింపులకు గురి చేయడం కొనసాగుతున్నది. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తమ మాట వినలేదని తమకు బానిసలుగా వ్యవహరించలేదని కుట్రతో టెండర్ పరిధి దాటి బయట టెండర్లల్లోకి పనులకు వెళ్లాలని ఆదేశించడం అధికారుల నియంతృత్వానికి నిదర్శనం. ఇదే వైఖరి కొనసాగితే సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికుల నుంచి అధికారులకు ప్రతిఘటన తప్పదని తెలియజేస్తున్నాం. ఒక్కో అధికారి తమ ఇండ్లలో ముగ్గురు కాంట్రాక్టు కార్మికుల చేత వెట్టిచాకిరి పనులు చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. సింగరేణి సంస్థ తమ సొంత జాగీర్ లాగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా మనుషులేనని అధికారులు గుర్తించాలని తెలియజేస్తున్నాము. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం అధికారులు వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యానికి కార్మికులకు మధ్య కాంట్రాక్టర్ ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా కార్మికులపై సింగరేణి యాజమాన్యమే నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నది. సమస్య వచ్చినప్పుడు మాకేం సంబంధం లేదని తప్పించుకునే సింగరేణి యాజమాన్యం వేదింపులలో మాత్రం మేమే ముందు అని అంటున్నది. అధికారులు ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికుల పట్ల కక్షపూరిత వైఖరిని మానుకోవాలని ఇండ్లలో పని చేయించుకునే విధానాన్ని స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే సింగరేణి వ్యాప్తంగా అధికారుల వైఖరికి నిరసనగా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App