TRINETHRAM NEWS

భక్తులకు నిరంతరాయంగా దర్శనం

సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా ఆలయ అధికారుల నిర్ణయం

ఫిబ్రవరి నెలలో జరుగు సమ్మక్క,సారలమ్మ జాతర దృష్ట్యా శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈనెల 21 నుండి 28 వరకు, ఫిబ్రవరి 4 నుండి 18 వరకు ప్రతి ఆదివారము ఆలయము తెల్లవార్లు తెరిచి భక్తులు నిరంతరాయముగా కోడె మొక్కుబడి, దర్శనము చేసుకొనుటకు అవకాశము కల్పించనైనదని, భక్తులు ఇట్టి అవకాశమును వినియోగించు కొనవలసినదిగా ఆలయ కార్య నిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు..