TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ నాయకులు 43 వ డివిజన్ లో టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో 80 లక్షల రూపాయలతో

సీసీ రోడ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మహంకాళి స్వామి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎన్నికల సమయంలో ప్రచారంలో బాగంగా మన శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని వీది లో ఈ రొజు మన రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలతో ఈ రోజు స్థానిక 43 వ డివిజన్ లో 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్ వేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రామగుండం కార్పొరేషన్ ప్లోర్ లీడర్ మహంకాళి స్వామి ప్రారంభించడం జరిగింది సందర్బంగా మాట్లాడుతూ ఇన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ 43 వ డివిజన్ ప్రజల పక్షాన కృత్ఞతలు తెలియజేసారు అదేవిధంగా రామగుండం నియోజకవర్గం లో ఎలాంటి సమస్య ఉన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రివర్యులు శ్రీధర్ బాబు సూచనల సలహాలతో ఈ ప్రాంత శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి తీసుకువస్తున్నారని అన్నారు అదేవిధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో పూర్తి పారిదర్శకంగా వ్యవహరిస్తామన్నారు ఎమ్మెల్యే పరిపాలనలో ఎలాంటి అవినీతి తావు లేకుండా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడమే కాంగ్రెస్ పార్టీ మరియు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధ్యేయం అన్నారు
అనంతరం బిసి సెల్ అధ్యక్షులు గట్ల రమేష్ మాట్లాడుతూ రోడ్డుకు సహకరించి వేడెల్పుకు సహకరించిన 43 వ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసారు రామగుండం నియోజకవర్గం లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు రామగుండం నియోజకవర్గ ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు అదేవిధంగా గత పాలకులు చేయడం వలన రామగుండం నియోజకవర్గం వెనుకబడిన విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎన్నడూ లేని విధంగా నిరంతరం ప్రజల పట్ల చిత్తశుద్ధితో అభివృద్ధిని ముందడుగులో నడిపిస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగుస్వామి,పాత పెల్లి ఎల్లయ్య ముస్తఫా 43 వ డివిసన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సొల్లు రామస్వామి, రామకృష్ణ, స్వరాజ్ , అడప కృష్ణ,మంతెన శ్రీకాంత్,మరియు పెద్ద ఎత్తున డివిజన్ ప్రజలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App