TRINETHRAM NEWS

Congress is beating the bellies of contract workers and giving gifts

వేతనాలు పెంచలేని ప్రభుత్వం దానధర్మాలకు మాత్రం జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతున్నది

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పొట్టలు కొట్టి ప్రతి చోటా కానుకలు బహుమతులు ఇస్తున్నది. మెడికల్ కాలేజీల పేరిట గెస్ట్ హౌస్ ల పేరిట, పోలీస్ స్టేషన్ల పేరిట, కమిషనరేట్ల పేరిట, సీసీ కెమెరాల పేరిట, హైదరాబాదు హుస్సేన్ సాగర్ లో పూడిక తీయడానికి కూడా సింగరేణి నిధులను వాడుకుంటూ సింగరేణి ప్రాంతాన్ని మాత్రం బొందల గడ్డ గా మారుస్తూ వాతావరణ కాలుష్యాన్ని పెంచుతున్నది. చాలీచాలని వేతనాలతో అత్యంత దుర్భర జీవితాలు గడుపుతున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు వేతనాల పెంపు లేక అల్లాడుతున్నారు. వేతనాలు పెంచలేని కాంగ్రెస్ ప్రభుత్వం కానుకల పేట మాత్రం విచ్చలవిడిగా సింగరేణి సొమ్మును దుబారా చేస్తున్నది.
భూ గర్భంలో రాకాసి బొగ్గు గనులో తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్తాన్ని చెమటగా మరచి దేశానికి వెలుగులు పంచుతున్న గని కార్మికుల కష్టమే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన గుత్తాసొమ్ముగా విద్యార్థులకు పంచిపెట్టిన కనుక.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడకపోవడం కోల్ బెల్ట్ ప్రాంతం పట్ల వివక్ష తప్ప మరొకటి కాదు.
వచ్చే పెన్షన్ చిల్లర డబ్బుల సరిపోక కుటుంబ పోషణ కోసం అడ్డ మీద కూలీలుగా కొందరు మారితే మరి కొందరు భిక్షాటన చేస్తూ నిలువ నీడ లేక బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో దర్శనం ఇస్తున్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేసిన సింగరేణికి రావాల్సిన బకాయిలు రాక ప్రభుత్వాలు ఇవ్వక ఖజానా ఖాళీ అయి కార్మిక ప్రాంతాలు కనీస అభివృద్ధికి నోచుకోక సంస్థ నేల చూపులు చూస్తుంది. గనిలో విధులు నిర్వహించే గని కార్మికుల తమ రక్తపు బొట్టు చూడని రోజులు లేవంటే అవుననక తప్పదు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు వేతనాల పెంపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మినిమం వేస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ వేతనాల పెంపు విషయంలో మంత్రి శ్రీధర్ బాబు సూచించినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress is beating the bellies of contract workers and giving gifts