అధికారం ఇచ్చినోళ్లను అరిగోస పెట్టే చరిత్ర కాంగ్రెస్స్‌దే…
రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ సర్కార్
మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తాండ్లంటే దౌర్జన్యం చేస్తరా
నియంతృత్వ వైఖరి కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి మంత్రి
అధికారం ఉన్న లేకపోయినా ప్రజల కోసమే పోరాటం చేస్తం
ఏడాదిలో ప్రజల విశ్వాసం కోల్పోయిన రేవంత్ సర్కార్
సమస్య తీవ్రతను గ్రహించి వెంటనే పరిష్కరించాలే
మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసుధనాచారి
ఎవరైతే అధికారం ఇస్తరో వాళ్ల బాగోగులకు బిన్నంగా ఆర్తనాదాలు కల్పించి అరిగోస పెట్టే చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని మాజీ శాసన సభాధిపతి, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసుధనా చారి అన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బాగంగా చేపట్టిన కెనాల్ పనులతో తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేస్తున్న మహాదేవ్‌పూర్ మండలం ఎల్కేశ్వరం ,సూరారం గ్రామాల్లో చిన్న కాళేశ్వరం భూనిరాస్వితులను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌తో కలిసి ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 1956నుంచి2014వరకు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టనష్టాలను అనుభవించారన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలను అనేక అన్యాయాలకు గురి చేసిందన్నారు.
అయితే వీటన్నింటికి పరిష్కారం ఒక్క తెలంగాణరాష్ట్ర ఏర్పడటమే అని గుర్తించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధన జీవితాశయంగా చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమ శక్తికి తలొగ్గిన అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను ఇచ్చిందన్నారు. అయితే దేశం, రాష్ట్రంలో అత్యధిక శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని బతికుతున్న తరుణంలో ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఏ రోజు రైతు సుఖంగా ఉన్న సందర్బాలు లేవన్నారు. సాగునీరు, కరెంటు, విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధర కోసం గోసపడ్డారని, ఒక సందర్బంంలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితులు తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారని, ఆ నిర్ణయాలు ప్రతి రైతు గుండెపై చేయి వేసుకుని ఆనందంగా ఉన్నారన్నారు. బారీ ప్రాజెక్టుల నిర్మాణం, 24గంటల కరెంటు, సాగునీరు.
చెరువులు, కొనుగోలు కేంద్రాలు, ధాన్యంనిల్వ చేసేందుకు గోదాంల నిర్మాణాలు చేశారని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులు ఒక్కచోట కూర్చుండి చర్చించుకునేలా రైతు వేదికలకు శ్రీకారం చుట్టిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. కానీ రాష్ట్రంలో అదికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది కాలంలోనే రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో రైతుభరోసా, రైతు రుణమాఫీ పేరు చెప్పిమోసం చేశారని, ఈనాడు మహాదేవ్‌పూర్ ప్రాంత రైతులు ఏం పాపం చేశారని అన్యాయం చేస్తున్నారనిఆయన ప్రశ్నించారు. తమకు నష్టపరిహరం అందలేదని,అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకుంటే పోలీసులతో ఇంత దౌర్జన్యంచేయిస్తరాఅని ఆయనఅసహనం వ్యక్తం చేశారు. రైతులు ఆందోళనలు చేసే పరిస్థితికి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి, ఈ ప్రాంత మంత్రి నియంతృత్వ వైఖరి కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తాము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల కోసమే పోరాటం చేస్తున్నామని, కేసీఆర్ నాయకత్వంలో ప్రజా ప్రయోజనాలేముఖ్యమన్నారు. చిన్న కాళేశ్వరం భూ నిర్వాసితుల ఆందోళనల తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని, ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రిగా శ్రీధర్‌బాబుకు ఉందన్నారు. ఏడాదిలోనే ఇంత దిగజారి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానిది నిర్మూలణాత్మమైన వైఖరి అని, అన్నింటికి పరిష్కారం పోలీసులే అని బావిస్తోందని, ప్రజలను అణిచివేయాలని చూస్తే తగినబుద్ది చెప్తారని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App