TRINETHRAM NEWS

మన గ్యాస్ మన చమురు వనరులపై

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు

మన సహజ వనరులను అదానీ, అంబానీ లకు దోచి పెడుతున్న పాలకులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగ ప్రభాకర్

Trinethram News : కాకినాడ, పిబ్రవరి 15: మన చమురు, సహజ వాయువు ఖనిజాలు ప్రకృతి వనరుల పై ఏపీ ప్రజల హక్కుగా కాపాడుకోవాలని కోరుతూ ఈ నెల 23 న కాకినాడ లో జరిగే సదస్సును విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఆదివారము ఉదయం స్థానిక ఎస్టీయూ భవన్ లో సీపీఐ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రన్ని ఆదుకోవాలంటే గ్యాస్ వాటా కోసము అందరం ఉద్యమించాలని అన్నారు కాకినాడ సముద్ర తీరంలో ఏర్పడిన చమురు గ్యాస్ నిక్షేపలు మన గ్యాస్ మన రాష్ట్రానకే దక్కాలని అప్పుల్లో వున్నా రాష్ట్రం అభివృద్ధి సాధించండానకి గ్యాస్ వాటా కోసం అన్ని రాజకీయ పార్టీలు వివిధ ప్రజాసంఘాలు ఏకమై పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు
కాకినాడ కు 30 కిలోమీటర్ల దూరాన సముద్ర గర్భంనుండి 2024, జనవరి 7న ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమయింది. క్రిష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ తోపాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందిని ఆంధ్ర తీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి.ని ఆయన అన్నారు మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్ధికాభివృద్ధి కి చాలా కీలకమైనదన్న విషయం అందరకు తెలిసిందేనని అన్నారు
ప్రపంచంలో ఏప్రాంతంలో నైనా స్దానికంగా లభ్యమయ్యే సహజవనరులను ఉపయోగించుకునే హక్కు ఆప్రాంతానికే వుంటుందనేది సహజ న్యాయ సూత్రం. సహజవనరులు ఏ రాష్ట్రంలో వుంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో 50 శాతం కేటాయించాలని 12 వ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పిందిని ముప్పాళ్ల అన్నారు . మన అవసరాలు తీర్చకుండానే 1500 కి.మీ. దూరానవున్న గుజరాత్, మహారాష్ట్ర కు మన తీరం నుండి గ్యాస్ ను అక్రమంగా తరలిస్తూ ఆంద్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. 
ఆంధ్ర ప్రాంతానికి న్యాయమైన గ్యాస్ కేటాయింపుల కోసం , న్యాయమైన ధర కోసం, న్యాయమైన 50 శాతం లాభం వాటా కోసం వామపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. అయినా గ్యాస్ కేటాయింపులు, ఆదాయం లో సగం పొందలేకపోయాం. అన్నారు
గోదావరి కృష్ణ బేసిన్ లో ఈ నిక్షేపాలు 70000 చ.కి మీ విస్తీర్ణంలో వ్యాప్తించి ఉన్నాయిని అన్నారు ప్రముఖ ఆయిల్ సహజ వాయువు ఉత్తప్తి దేశమైన కువైట్ కన్నా మన దేశం లోనే బాంబే హై కన్నా మన గోదావరి బేసిన్ లోన్ ఎక్కువ నిల్వలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి అని ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు
23 న జరగ తలపెట్టిన సదస్సు ను ఉపాధ్యాయలు విద్యార్థులు కార్మికులు రైతులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ మన తీర ప్రాంతంలో ఉన్న సహజ వనరులను పాలకులు బడా కార్పొరేట్ కంపెనీలు దాసోహం చేస్తున్నారని విమర్శించారు రాష్ట్ర భూభాగం నుండి వేల కిలోమీటర్ల పైపు లైన్ ద్వారా రాష్ట్ర వెలువలకు తరలించే క్రమంలో పలు పర్యాయాలు గ్యాస్ లీకేజీ అయ్యి ప్రజలు పశువుల ప్రాణాలు కోల్పోతున్నారని పంటలు తోటలు నాశనం అవుతున్నాయని ఆయన ఆరోపించారు మన గ్యాస్ మనకే దక్కాలని చేస్తున్న పోరాటాన్ని ముందుకు తీసుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు

ఇంకా ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి కె సత్తిబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
తోకల ప్రసాద్, ప్రముఖ విద్యావేత్తలు ఆలపాటి శ్రీనివాస్, కె ఆదినారాయణ మూర్తి, చింతపల్లి సుబ్బారావు, పి సుబ్బరాజు, నక్క కిషోర్, జానీ మాస్టర్ సీపీఐ నాయకులు పి సత్యనారాయణ, అన్నవరం సీపీఐ జిల్లా నాయకులు శాఖ రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా సహాయ కార్యదర్శి నక్క శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App