
Conducting district level sports competitions for sports school admissions
పెద్దపల్లి, జూన్-29: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కొరకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను శనివారం ఐ.టి.ఐ. కళాశాల గ్రౌండ్ లో జిల్లా విద్యా శాఖ అధికారి డి. మాధవి జెండా ఊపి ప్రారంభించారు.
జిల్లా స్థాయి క్రీడా పోటీలలో 26 మంది బాలురు, 17 మంది బాలికలు పాల్గొన్నారని, ఇక్కడ పది పాయింట్లు పైన వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులను జూలై 7వ తారీఖున స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట ఆవరణలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి అక్కపాక సురేష్ తెలిపారు.
స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ కార్యక్రమంలో ఎస్.జి.ఎఫ్. సెక్రెటరీ కె.శ్రీనివాస్, పేట టిఎస్ జనరల్ సెక్రెటరీ వి.సురేందర్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు కడారి రవి, లక్ష్మణ్, సిహెచ్ శైలజ, శోభారాణి, ప్రణయ్, హరికృష్ణ, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, జావేద్, ఖాజాబీ, శ్రీధర్, సోమశేఖర్, కుమారస్వామి, రమ్య, కవిత, సునీత, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
