Condemn conspiratorial, psychological attacks on workers: TNTUC
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎల్లో కార్డు, రెడ్ కార్డు పేరుతో కార్మిక వర్గం పైన అనేక రకాలుగా దాడులు కుట్రలను ఆర్డర్ ఉత్తర్వాలను బేసరతుగా రద్దు చేయాలని TNTUC (సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ )వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు డిమాండ్ చేశారు.
గోదావరిఖని కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ,
150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి యావత్ భారతదేశానికి ఒక వెన్నెముకగా పేరుగాంచిందని, గత 30 సంవత్సరాల నుండి అనేక రకాలుగా కార్మికులను కుదిస్తూ సింగరేణి ప్రాంతాలలో ఒకపక్క నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్న సింగరేణి యాజమాన్యం పర్మనెంట్ కార్మికులను తగ్గిస్తూ కాంట్రాక్టు కార్మికులను పెంచుతూ అనేక లాభాలను తీసుకొస్తూ, ప్రభావిత గ్రామాలను నట్టేట ముంచుతూ నూతన బొగ్గు బావులను ఏర్పాటు చేయకుండా ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యంగా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుందన్నారు తెలంగాణలో సింగరేణి ఒక గుండెకాయగా ఉందని, ప్రైవేటికరణకు వ్యతిరేకిస్తూ ఒకపక్క ఆందోళన చేస్తున్న ఈ తరుణంలో సింగరేణి మరొక కుట్రకు తెరలేపిందన్నారు.
రెడ్ కార్డ్, ఎల్లో కార్డు పేరుతో కార్మికులను విభజిస్తూ ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులనే బాధ్యులగా చేస్తూ రెడ్ కార్డు ఉన్నోళ్లకు ఒక న్యాయం ఎల్లో కార్డు ఉన్నోళ్లకు ఒక న్యాయమనే పద్ధతిలో ఉత్తర్యులను తీసుకురావడం సిగ్గుచేటని అన్నారు.
వెంటనే ఇలాంటి చర్యలను వెంటనే రద్దు చేసుకోవాలని నిమ్మకాయల ఏడుకొండలు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మునిగంటి దామోదర్ రెడ్డి టిఎన్టియుసి పెద్దపల్లి పార్లమెంటరీ అధ్యక్షులు, సల్ల రవీందర్ TNTUC రాష్ట్ర నాయకులు, చిటికెల రాజలింగు డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, పెగడపల్లి రాజనర్సు కోశాధికారి, నరెడ్డి స్వరాజ్యం రాష్ట్ర మహిళా కార్యదర్శి, బరిగల కళావతి రాష్ట్ర మహిళా కార్యదర్శి చిట్యాల అశ్విని రాష్ట్ర మహిళా కార్యదర్శి, పాత నరసింహారావు కాంట్రాక్టు లేబర్ యూనియన్ ప్రెసిడెంట్, కొండి శ్రీను 8వ కాలనీ బీసీ సెల్ అధ్యక్షుడు, రామగిరి రాజేశ్వరి టౌన్ టిడిపి కార్యదర్శి, సుందిళ్ల స్వామి ఎస్సీ సెల్ టిడిపి టౌన్ కార్యదర్శి
తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App