TRINETHRAM NEWS

డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

Trinethram News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు 2008 dsc అభ్యర్థుల మైన మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 9 తెచ్చి క్యాబినెట్ అప్రూవల్ కూడా చేసి ఒక్క సంవత్సరం నడుస్తున్న కూడా ఇప్పటివరకు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు.

అంతేకాకుండా ఇది చాలదు అన్నట్లు సెప్టెంబర్ నెలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడం వల్ల మా ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు ఊడి గత మూడు నెలల నుండి రోడ్డు మీద ఉన్నాము.

మీరు చేసిన ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వల్ల మా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి ఆత్మహత్యలకు దారి తీసే విధంగా ఉన్నది.

గతంలో ఎన్నడు కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగి 100 రోజులు అయినా కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App