అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
Trinethram News : అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్‌కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App