Complaint to the Collector on Brahmakunta Kunta (Pond) Shikham Bhoomi in Choppadandi
చొప్పదండి :త్రి నేత్రం న్యూస్
కలెక్టర్ : డిప్యూటీ తహసీల్దార్ పిలిచి తక్షణమే ఇరిగేషన్, రెవెన్యూ కలిసి రి సర్వే చేయండని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఇచ్చిన 6 ఎకరాలకు పట్టా ఎలా ఇచ్చారో ఎంక్వయిరీ చేసి తగు చర్యలు తీసుకోండి అని ఆదేశాలు ఇచ్చారు.
జిల్లాలోని చొప్పదండి పట్టణ కేంద్రంలో బ్రాహ్మణకుంట కుంట (చెరువు) శిఖం భూమిని కబ్జా నుండి కాపాడాలని, చెరువు శిఖంలో 6 ఎకరాల భూమికి అక్రమంగా ఇచ్చిన పట్టాను రద్దు చేయాలి, బ్రాహ్మణకుంట చెరువు శిఖం భూమికి రీ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని, ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్వోసీ ఇవ్వకూడదని, శిఖం భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలని కోరుతూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగినది. తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన అప్పటి తహసిల్దార్ నరేందర్, సర్వేర్ జీవ రెడ్డి పై ఇరిగేషన్ అధికారులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పట్టణానికి కూతవేటు దూరంలో బ్రాహ్మణకుంట కుంట శిఖం భూమి యథేచ్ఛగా కబ్జాకు గురవుతుంది. పట్టా నెంబరు చూపుతూ కుంట (చెరువు) శిఖంలో ప్లాట్ల అమ్మకాలు చేస్తున్నారు. కుంట శిఖం భూమి పక్కనే పట్టా భూమి 301ని చూపుతూ దాని పక్కనే బ్రాహ్మణకుంట శిఖం భూమి సర్వెనెంబరు 300 లో ప్లాట్ల విక్రయాలను జరుపుతున్నారు. పట్టా భూమి యొక్క సర్వే నెం: 301లో డిటిసిపీ లే ఔట్లు అనుమతులు లేకుండానే ప్లాట్ల విక్రయాలు చేస్తున్నారు. తేదీ: 11.09.2023 రోజున కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిర్యాదు చేయడం జరిగింది. అప్పటి తహసిల్దార్ నరేందర్, సర్వేయర్ జీవన్ రెడ్డి కబ్జాదారులతో కుమ్మక్కు అయ్యి బ్రాహ్మణకుంట శిఖం భూమి కబ్జాకు గురికాలేదని తప్పుడు నీవేదికలు ఇవ్వడం జరిగినది. జిఓ నెంబర్: 168 ప్రకారం జలవనరుల సమీపంలో రిక్రియేషన్ కార్యక్రమాలు, గ్రీన్ బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి భావనల నిర్మాణం చేపట్టకూడదని జీవోలో పేర్కొంది.
మున్సిపాలిటీలు, హెచ్ఎండిఏ యూడిఏ పరిధిలో నదులు చెరువులు, కుంటలకు ఎస్టిఎల్ను ఎలా లెక్కించాలని దానిపై స్పష్టమైన విధివిధానాలు నిర్దేశించింది. వాస్తవానికి ఎఫ్ఎల్ మీద తహసిల్దార్, సర్వేయర్, నీటిపారుదల శాఖ ఏఈ, మున్సిపల్, అటవీశాఖ సిబ్బంది నేతృత్వంలో క్షేత్రస్థాయి పర్యటన, పరిశీలిన తర్వాత నివేదిక మాత్రమే ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా నీటిపారుదల శాఖ ఎఫ్ఎల్ రిపోర్టు ఇచ్చేముందు ప్రభుత్వ నిబంధనలు ఏవి పాటించలేదు. కబ్జాదారులకు అనుకూలంగా ఎస్టిఎల్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది.
రెవెన్యూ ఇరిగేషన్ ఇచ్చిన తప్పుడు రిపోర్టులతో చొప్పదండి మున్సిపల్ కమిషనర్ నిర్మాణ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల బ్రాహ్మణికుంట చెరువు పూర్తిగా కబ్జా గురవుతున్నది. ఎన్వోసీ సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. హద్దులు నిర్ణయించకుండా ఎన్వోసీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని కోరుతున్నాను. కుంట శిఖం భూమిలో 6 ఎకరాలు గతంలో పట్టా ఇచ్చారు. ఇచ్చిన పట్టాను రద్దు చేయగలరు, చొప్పదండి పట్టణంలోని బ్రాహ్మణకుంట కుంట శిఖం భూమికి రీ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించిన తర్వాతనే నిర్మాణ అనుమతులు ఇచ్చేవిధంగా ఆదేశాలు ఇవ్వగలరు. పట్టభూమి సర్వే నెంబర్ : 301
మరియు కుంట శిఖం సర్వే నెంబర్:300 లో రిజిస్ట్రేషన్ అయిన వాటికి నిర్మాణ అనుమతులు ఇవ్వద్దని కోరుతున్నాము. తమరు జోక్యం చేసుకొని బ్రాహ్మణకుంట కుంట (చెరువు) శిఖం భూమి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీ సర్వే నిర్వహించి పూర్తస్తాయి హద్దులు నిర్ణయించాలని, ఎన్వోసీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని, చెరువు శిఖం భూమిలో అక్రమంగా 6 ఎకరాలకు ఇచ్చిన పట్టాను రద్దు చేయాలి. నిర్మించిన నిర్మాణాలను కూల్చివయాలని, చెరువు శిఖం భూమి కబ్జానుండి కాపాడాలని కోరుతున్నాము.
బండారి శేఖర్
ప్రధాన కార్యదర్శి
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App