TRINETHRAM NEWS

Collector Gautham inspected the Vinayaka Nimarjanam works

త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం
సమాచార పౌర సంబంధాల శాఖ

 వినాయ నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం పరిశీలించారు.
 వినాయ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా  మంగళవారం మేడ్చెల్  మల్కాజిగిరి జిల్లాలోని  సుతారి, శామీర్  పేట్, మేడ్చేల్ పెద్ద చెరువులలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గౌతం పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఏర్పాట్లు ఏవిధంగా జరుగుతున్నాయని ప్రత్యేక అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువులలో లోతు ఎంతవరకు ఉందని, ఎన్ని క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారని అడిగి, అవసరమైతే అదనపు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి చెరువుల దగ్గర తప్పనిసరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టరు తెలిపారు.

అదేవిధంగా గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు ఎంత మంది వస్తారనే అంచనాతో సరిపడా మోబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాలు ఒకే చోట నిలిచిపోకుండా దగ్గరగా ఉన్న చెరువులకు మల్లించాలని కలెక్టరు సూచించారు. నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలని కలెక్టరు ప్రత్యేక అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చెల్ మున్సిపల్ కమీషనర్ నాగిరెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమీషనర్ స్వామి, మేడ్చెల్ తహాసీల్దారు సునీల్, ఇరిగేషన్ ఈఈ సునిత, ఎసిపి వెంకటరెడ్డి, ఎంపిడిఓలు వసంత లక్ష్మి, మమతాబాయి, పోలీసు, ట్రాఫిక్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collector Gautham inspected the Vinayaka Nimarjanam works