TRINETHRAM NEWS

తెలంగాణ తల్లి విగ్రహం పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమోషన్ స్పీచ్!

Trinethram News : Hyderabad : తెలంగాణ ప్రజలకు ఈరోజు పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన సభలో మాట్లాడు తూ.. 2009 సరిగ్గా ఇదే రోజు తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వచ్చిందని అన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష లకు పునాదిరాయి పడిన రోజు అని తెలిపారు. అదేవిధంగా సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భం గా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చాని పేర్కొన్నారు.

తెలంగాణ తల్లి పై ప్రతిపక్షా లు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి వేరు దేవత వేరు, ఏ తల్లికి కిరీటం ఉండదు దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుంది ప్రభుత్వం ఆవిష్కరిస్తు న్నది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ గ్రామ దేవతకు కిరీటం ఉంటుందా?..

ఈ విషయాన్ని జనాలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో సబ్బండ వర్గాలను నడిపించిన మూర్తి తెలంగాణ తల్లి అని కొనియాడారు.నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపిన స్ఫూర్తి తెలంగాణ తల్లిదే అని తెలిపారు.

తెలంగాణ తల్లి రూపంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని.. నిండైన రూపాన్ని తీర్చిదిద్ద సచివాలయంలో ఆవిష్కరి స్తున్నామని అన్నారు.

మెడకు కంటె, గుండు పూసలహారం, చెవులకు బుట్టకమ్మలు, ముక్కు పుడక, బంగారు అంచుతో కూడిన చీరతో చాకలి ఐలమ్మ, సమ్మక్క- సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపం ఉందని సీఎం పేర్కొన్నారు.

కుడి చేతితో జాతికి అభయమిస్తూ.. ఎడమ చేతిలో తెలంగాణలో పండే పంటలతో తల్లి దర్శనమి స్తుందని సీఎం తెలిపారు. చరిత్రకు దర్పంగా వీటన్ని రూపొందించాం తెలంగాణ తల్లిని ఈరోజు సచివాల యంలో ఆవిష్కరిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App