CM Revanth Reddy hailed Gaddar as the lifeblood of the Telangana movement
Trinethram News : Telangana: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో కోట్ల మంది ఉరకలెత్తేలా చేసిన గొంతు ఆయనది. ఆ స్వరం అందర్నీ కదిలించింది. చైతన్యపూరితం చేసింది. గద్దర్.
మనం ఆవేదనలో, బాధలో, నిరాశలో ఉన్నప్పుడు ప్రజాకవి గద్దర్ పాటలు వింటే చాలు.. ఒక్కసారిగా కొండంత ఉత్సాహం, ధైర్యం, చైతన్య స్ఫూర్తి వస్తాయి.
అందుకే గద్దర్ వర్ధంతి సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన్ని స్మరించుకున్నారు. “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. గద్దర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App