TRINETHRAM NEWS

యాదాద్రి పవర్ ప్లాంటును జాతికి అంకితమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : యాదాద్రి జిల్లా : డిసెంబర్07
తెలంగాణ సిగలో మరో మణిహారం చేరింది విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలవనుంది, రాష్ట్ర విద్యుత్ అవస రాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్‌ స్టేషన్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జాతికి అంకితం చేశారు.

థర్మల్ స్టేషన్‌లోని పైలాన్‌ను ముఖ్యమంత్రి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

యాదాద్రి థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల రెండో యూనిట్ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి పూజలు నిర్వహించారు. పవర్ ప్లాంట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం, మంత్రులు తిలకించారు.

నల్గొండ జిల్లాలోని దామరచర్లలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో మొత్తంగా 5 యూనిట్లు ఉన్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App