TRINETHRAM NEWS

రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?.. సీఎం రేవంత్‌ సీరియస్‌

Trinethram News : హైదరాబాద్‌ : లగచర్ల దాడి కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్‌కు సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతీనొప్పి వచ్చింది. జైలు నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా రైతు ఈర్యానాయక్‌కు బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్‌ తీవ్రంగా స్పందించారు..

రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడిన సీఎం.. ఘటనపై ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

ఛాతీనొప్పి రావడంతో రైతు ఈర్యానాయక్‌కు మొదట సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. హీర్యానాయక్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని.. మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌ ఎమర్జెన్సీ విభాగంలో రైతుకు చికిత్స అందిస్తున్నారు. హీర్యా నాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App