TRINETHRAM NEWS

రాష్ట్రంలో పేదలు, పెత్తందారులకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు సీఎం జగన్. మరో 36 గంటల్లో ఎన్నికల సమరం రానుందని, ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉన్నారా అని ప్రజలను అడిగారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఈ నియోజకవర్గ అభ్యర్థి మనోహర్ నాయుడు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. ఆయన సభకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు.

59 నెలల పాలనలో రూ.2లక్షల 70 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో వేశామన్నారు. ఇంటి వద్దకే రేషన్, వృద్దాప్య పెన్షన్ అందించామన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామన్నారు సీఎం జగన్. ఇలాంటి మార్పు గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా ప్రభుత్వం అండగా నిలబడిందని చెప్పారు.

రైతుల కోసం రైతు భరోసా, రైతు బీమా, ఆర్బీకే కేంద్రాలు, పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేశామన్నారు. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు అండగా నిలిచామన్నారు. ఈ ఎన్నికలు రాబోయే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు.

రాష్ట్రంలో పేదలు, పెత్తందారులకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు సీఎం జగన్. మరో 36 గంటల్లో ఎన్నికల సమరం రానుందని, ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉన్నారా అని ప్రజలను అడిగారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఈ నియోజకవర్గ అభ్యర్థి మనోహర్ నాయుడు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. ఆయన సభకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. 59 నెలల పాలనలో రూ.2లక్షల 70 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో వేశామన్నారు. ఇంటి వద్దకే రేషన్, వృద్దాప్య పెన్షన్ అందించామన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామన్నారు సీఎం జగన్. ఇలాంటి మార్పు గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు.

స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా ప్రభుత్వం అండగా నిలబడిందని చెప్పారు. రైతుల కోసం రైతు భరోసా, రైతు బీమా, ఆర్బీకే కేంద్రాలు, పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేశామన్నారు. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు అండగా నిలిచామన్నారు. ఈ ఎన్నికలు రాబోయే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పేరుమీద ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా అర్హత ప్రామాణికంగా పథకాలు అందజేశామన్నారు. విద్యారంగంలో నాడు – నేడు పేరుతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం అన్నారు.. ఒక్క సెంటు అయినా ఇచ్చారా అని విమర్శించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశారా అని నిలదీశారు.

అవ్వాతాతలకు ప్రతి నెలా ఇంటివద్దకే వచ్చే పెన్షన్ ఆపి చంద్రబాబు వారి ఉసురుపోసుకున్నారన్నారు. పేదలకు అందే లబ్ధిని వారి ఖాతాల్లో జమ కాకుండా చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో చేతులు కలిపి అడ్డుకున్నారన్నారు.

చంద్రబాబు ప్రలోభాలకు ఎవరూ మోసపోవద్దని సూచించారు. బటన్లు నొక్కి లబ్ధిదారులకు మంచి చేయాలనుకుంటే వాటిని అడ్డుతగిలారని విమర్శించారు. తనకు ఓటు వేస్తే పథకాలు కొనసాగింపు అని.. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు అని చెప్పారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే, ఎంపీకి వేసేవి కావని రాష్ట్రప్రజల భవిష్యత్తును మార్చేవని వివరించారు.