నేటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
Trinethram News : చిత్తూర్ : Jan 06, 2025,
ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు సోమవారం నుంచి 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ ద్రవిడ వర్సిటీలో ‘స్వర్ణ కుప్పం విజన్-2029’ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు. అలాగే కుప్పం మండలం నడిమూరులో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలెట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం కుప్పం టీడీపీ ఆఫీస్‌లో నియోజకవర్గ నేతలను చంద్రబాబు కలవనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App