TRINETHRAM NEWS

తిరుమల ఘాట్ రోడ్ లో దొర్లీపడ్డ కొండ చరియలు

Trinethram News : బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను శనివారం రాత్రి మహాబలిపురం- కరైకల్ వద్ద తీరం దాటి.. బలహీనపడి తీవ్ర వాయు గుండంగా కొనసాగుతోంది.

దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, కలియుగ వైకుంఠం తిరుమలలో శనివారం నుంచి వర్షం తెరిపినివ్వడం లేదు. దీంతో ఆదివారం తెల్లవారుజామున రెండో ఘాట్ రోడ్డులో కొండచరి యలు విరిగిపడ్డాయి.

ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటి కప్పుడు జేసీబీలతో బండ రాళ్లను తొలగిస్తున్నారు. గోగర్బం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలు తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App