TRINETHRAM NEWS

విద్యార్థుల భవిష్యత్తు ఆశయాలకు 10వ తరగతి మలుపు

విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలి

మనం చేసే మంచి పనులే మన భవిష్యత్ ను తీర్చిదిద్దుతాయి

పదో తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్

Trinethram News : తూర్పుగోదావరి : విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళిక బద్ధంగా విద్యను అభ్యసించాలని , స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తు ను నిర్ణయించే తరగతి 10 వ తరగతి అన్న విషయాన్ని గుర్తెరిగి ఆమేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఉద్బోధించారు.

తూర్పుగోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమవసతి గృహాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభకు “ప్రేరణ “ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జిజియు) లో శుక్రవారం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించుకుని వాటినీ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ మేరకు కృషి చేయాలని చెప్పారు . అందుకు 10 వ తరగతి సరైనదని తెలిపారు. మీరు కష్టపడి బాగా చదివితే మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుందని అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, వాటిని సాకారం చేసుకోవడం మీ లక్ష్యం గా ఉండాలని పేర్కొన్నారు. కష్టించే విధానానికి ప్రత్యామ్నాయ oలేదనీ , కష్టే ఫలి అనే నానుడి మరవరాదని కలెక్టర్ తెలిపారు. మనం చేసే మంచి పనులే మన భవిష్యత్ ను తీర్చిదిద్దుతాయి , చిన్నప్పటి నుంచి మంచి నడవడిక కూడా మంచి పౌరులుగా ఎదగడానికి దోహదం చేస్తాయని కలెక్టర్ తెలిపారు.

విజ్ఞానం రావాలంటే ఆయా పాఠ్యాంశాలను పూర్తిగా చదవాలని అప్పుడే వాటిపై గట్టిపట్టు వస్తుందని అన్నారు. టెస్ట్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అలాగే విద్యలో మూడవ ముఖ్యమైన అంశం స్వీయ ప్రేరణ అని సమాజంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు గర్వపడేలా విద్యార్థులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద కలలు కనాలని వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నాలు చేయాలన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూక్తిని విద్యార్థులకు గుర్తు చేశారు. భారతీయ విద్యా విధానంలో 10వ తరగతి జంక్షన్ పాయింట్ అని అన్నారు. మీ కెరియర్ ఏ విధంగా ఉండాలని అంశంపై పదో తరగతి విద్యార్థులకు స్పష్టత ఉండాలని చెప్పారు. ఏ పరీక్షలకు సిద్ధపడాలన్న ఆయా పాఠ్యాంశాల లోని ప్రాథమిక అంశాలపై గట్టిపట్టు ఉండాలని తెలిపారు. విద్యార్థులు తమ సామర్థ్యాలను అంచనా వేసుకుని, చదువును ఆనందించుతూ చదవాలని అన్నారు.

తొలుత జిజియూ రిజిస్ట్రార్ డాక్టర్ పి ఎం ఎం ఎస్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు వారి జీవితంలో తొలిసారిగా హాజరవుతున్న పబ్లిక్ పరీక్షలపై పదో తరగతి అన్నారు. పరీక్షలు అంటే విద్యార్థులకు ఉన్న భయం పోగొట్టేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థుల జీవితంలో 10వ తరగతి మైలురాయి వంటిదని అన్నారు. విద్యార్థులు నూటికినూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం ఎస్ శోభారాణి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ముందస్తు సంసిద్ధత గురించి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. వివిధ రంగాల కి చెందిన వ్యక్తులు ద్వారా స్ఫూర్తిని అందించే ఉద్దేశంతో ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు చెప్పారు.

తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని విద్యార్థులకు జిజియు యాజమాన్యం సమకూర్చిన పరీక్షా సామాగ్రిని కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జి జి యు డీన్ డాక్టర్ ఎన్. లీలావతి, డైరెక్టర్ డాక్టర్ ఎం . శ్రీనివాసరావు, గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పీజీ రామానుజమ్ జిల్లా వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముప్పిడి రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App