TRINETHRAM NEWS

నెల్లూరు నగరంలోని 13వ డివిజన్‌ సింహపురి హాస్పిటల్ జంక్షన్ నుండి యలమవారిదిన్నెకు వెళ్ళు ప్రాంతంలో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న బి.టి. రోడ్డు పనులకు నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. స్థానిక డివిజన్ లో చిన్న చిన్న పనులు మినహా దాదాపు అన్నీ రకాలుగా అభివృద్ధి పనులు చేసామని, త్వరలో అన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.