TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి కార్మికులకు 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్పెషల్ ఇన్సెంటివ్ లాభాల వాటా యాజమాన్యం కార్మికులకు 33% ప్రకటించడం జరిగింది. కానీ వచ్చిన లాభాలకు సంబంధించి అండర్ గ్రౌండ్ కార్మికులకు ఎంత ? సర్ఫేస్ కార్మికులకు ఎంత? డిపార్ట్మెంట్స్ వారికి ఎంత? అనేదే క్లారిటీ లేకుండా సర్కులర్ ఆలస్యంగా జారీ చేసిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జీ1, బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, గార్లు పేర్కొన్నారు. కార్మికుల ఖాతాలో ఏడవ తారీఖున జమ చేయబడుతుందని అదే రోజు యాజమాన్యం సర్కులర్ విడుదల చేసింది. కానీ పూర్తి వివరాలు లేకుండా, పే స్లిప్ ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వహించింది.

గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు ముందుగానే సమాచారం అందించినట్టు వారు అండర్ గ్రౌండ్ కు రూ.771.11 సర్ఫేస్ కార్మికులకు రూ. 610.46 డిపార్ట్మెంట్స్ వారికి 563.50 ఒకరోజు మస్టర్ కు తెలియజేయడంతో అధికారకంగా ఏడవ తారీకు సాయంత్రం వరకు కూడా వివరాలు తెలియజేయకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. గుర్తింపు సంగం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంగం ఐ ఎన్ టి యు సి వాట్సప్ గ్రూపులలో తెలిపిన వివరాలకు మరొక 120 రూపాయలు కలిపి మెసేజ్ రావడం జరిగింది ‌. ఈ తతంగంఅంతా కార్మికులు చూసి గందరగోళానికి అయోమయానికి గురయ్యారు. కానీ వాస్తవ ప్రకటనలు యాజమాన్యం సర్కులర్ విడుదల చేయకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన పే స్లిప్పులు కార్మికులకు వెంటనే ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App