ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని గోదావరిఖని బస్ డిపో ముందు సి.ఐ.టి.యూ. ధర్నా.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ముందు ధర్నాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
అందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని బస్ డిపో ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఐక్యతను దెబ్బతీయడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు విధించడం జరిగిందనీ అన్నారు. దీన్ని అలుసుగా తీసుకొని కార్మికుల ప్రశ్నించకుండా ఉండడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే చేసిందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని డిపో మేనేజర్ దగ్గర నుంచి
పై అధికారుల వరకు కార్మికులపై పనిగంటలు, పని వేళలు, పని భారాలు మోపుతున్నారనీ అన్నారు.
వారంలో ఆరు రోజుల పాటు సింగిల్ క్రూ డ్యూటీలు చేయిస్తున్నారనీ అన్నారు.
ఆఫ్ లు క్యాన్సల్ చేసి డబల్ డ్యూటీలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మహిళలకు కూడా మినహాయింపు లేకుండా అర్ధరాత్రి వరకు డ్యూటీలు చేయిస్తున్నారన్నారు. నెలకు నాలుగు డబల్ డ్యూటీ చేయాలని, ఒకవేళ చేయకపోతే సెలవులు ఇవ్వమని చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా పర్మినెంట్ డ్యూటీ చార్టుల్లో మార్పులు చేస్తామని తీవ్రమైన బెదిరింపులు చేస్తున్నారనీ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఒక్కరోజైనా సరే సెలవు దొరకడం కార్మికులకు కష్టంగా మారిందన్నారు.
ఇలాంటి వేధింపులు డిపో మేనేజర్, పై అధికారులు ఆపాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందనీ అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలకు అనుమతిస్తామని హామీ ఇవ్వడం జరిగిందనీ కానీ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్న ఇంతవరకు ఆ హామీని అమలు చేయడం లేదన్నారు. అంతేకాకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన వెల్ఫేర్ కమిటీలో కొత్తవారిని నియమించాలని ఆర్టీసీని ఆదేశించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా కూడా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలనే ఆలోచన లేనట్లు ఉందని అన్నారు.
కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవడం పాలకుల భిక్ష కాదని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కు అని ఇది పాలకులు గుర్తించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కడం సరైనది కాదని, ఆర్టీసీ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా కార్మిక వర్గం, ప్రజలు అండగా నిలవాల్సి ఉందని అన్నారు. అదేవిధంగా అదేవిధంగా ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలని,
వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దీంతో పాటు ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని, ప్రజాతంత్ర హక్కుల పునరుద్ధరించాలని, కార్మికులపై వేధింపులు ఆపాలని అన్నారు.
ప్రజల అవసరాలకు సరిపోయే విధంగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు సామాజిక ట్రస్టులకు కార్మిక సంఘాల భాగస్వామ్యంతో బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంను డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వంను హెచ్చరించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు నేర్వట్ల నరసయ్య, నాయకులు, కార్యకర్తలు టి.నరహరి రావు, రంగయ్య, శివకుమార్, గణేష్, బాలకృష్ణ, శ్రీనివాస్, తిరుపతి, సంపత్, దీప, మహేశ్వరి, అంజలి, శంకరమ్మ, నరసమ్మ, మంజుల, రమ, వాసవి, రజియా సుల్తానా, వరలక్ష్మి,సుగుణమ్మ, జమున తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App