TRINETHRAM NEWS

CITU campaign to solve the problems of Singareni workers

అర్జీ1, బ్రాంచి లో గోడ పోస్టర్ ఆవిష్కరణ కరపత్రాలు పంపిణీ కార్మికుల సంతకాల సేకరణ

అర్జీ1,బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్,

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం1 లోని జీడీకే -2, 11, ఇంక్లైన్ ఏరియా వర్క్ షాపులలో, కార్మికుల సమస్యలతో కూడిన గోడ పోస్టర్స్ ఆవిష్కరించి కరపత్రాలు పంపిణీ చేసి సంతకాల సేకరణ ఉద్యమం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ, సింగరేణిలో గుర్తింపు పత్రం తీసుకోనందున అన్ని యూనియన్లతో సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరారు, ఎన్నికలు నిర్వహించి 8 నెలలు గడిచినా ఇప్పటివరకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో అధికారికంగా సంప్రదింపులు జరిపి అమలు చేయలేక పలు సమస్యలు పెండింగ్లో ఉంటున్నందున సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియుగా పలు సమస్యలపై పోరాటానికి సిద్ధమైందని ఆగస్టు 20 నుండి సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంతకాల సేకరణ చేసి 26న మైన్స్ డిపార్ట్మెంట్ లలో మేనేజర్లకు వినతిపత్రం అందించి 28న అన్ని జిఎం ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని, ఇందులో ముఖ్యంగా గెలిచిన సంఘం ఏఐటీయూసీ

CITU campaign to solve the problems of Singareni workers

అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున గెలిచినప్పటి నుండి రెండు సంవత్సరాల గుర్తింపు పత్రం ఇచ్చి స్ట్రక్చర్ సమావేశాలకి ఆహ్వానించాలని లేదంటే అన్ని యూనియన్లను సమానంగా గుర్తించాలని, గత ఆర్థిక సంవత్సరం సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించి 35% వాటా చెల్లించాలని, సిఎంపీఫ్ అన్ లైన్లో తప్పులను వడ్డీ రేటు సరిచేసి పెండింగ్ చిట్టీలను వెంటనే ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికులకు రివైజ్డ్ పెన్షన్ మరియు గ్రాట్యూటీని వెంటనే చెల్లించాలని మరియు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 30 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కోల్ ఇండియాలో అమలవుతున్న అలవెన్స్ లపై ఆదాయపన్ను మాఫీని ఒప్పందాన్ని సింగరేణిలో కార్మికులకు అమలు చేయాలని, సొంతింటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులతో విస్తృతంగా సంతకాల సేకరణ విజయవంతంగా జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్ష కార్యదర్శు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి, జెల్ల గజేంద్ర, పి శ్రీనివాసరావు, వంగల రాములు, జీడీకే -2 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ ఏ శంకరన్న, ఈ సమ్మయ్య, కొండపల్లి కృష్ణ, సదానందం, తోట శ్రీనివాస్, కొమురయ్య, జీడీకే 11, ఇంక్లైన్ జంగాపల్లి మల్లేష్, మునుకుంట్ల రామన్న, నవీన్ కుమార్, దేవేందర్, ఏరియా వర్క్ షాప్ పిట్ కార్యదర్శి నంది నారాయణ, బొద్దుల ఓదెలు, బాదే రవి, సంతోష్ కుమార్, సండ్ర రాజమౌళి, బండారి సత్తి, తదితరులు పాల్గొన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CITU campaign to solve the problems of Singareni workers