గాంధీ నగర్ లో సిఐటియు బస్తిబాట
స్థానిక సమస్యలపై కార్మిక కుటుంబ సభ్యులతో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి స్థానిక గోదావరిఖని గాంధీ నగర్ కార్మిక కుటుంబ సభ్యులతో స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యపై మాట్లాడేందుకు సింగరేణి కాలనీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బస్తిబాట నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కార్మికులు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత కొంత కాలంగా ఆరోఓ ప్లాంట్ పనిచేయడం లేదని మంచినీటి సమస్య ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందన్నారు, అలాగే డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందని క్వార్టర్లు వంపులో ఉండడం వల్ల మురుగునిరు చేరుకున్న పరిస్థితి ఉందన్నారు, రోడ్లు లైటింగ్ తదితరు సమస్యలు కార్మిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది,
మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మేనేజ్మెంట్ దృష్టికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు గా తీసుకు వెళ్తామని తుమ్మల రాజారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని కార్మికుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంత తీవ్రతంగా ఉన్నప్పటికీ సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, సంక్షేమానికి పూర్తిస్థాయిలో నిధుల అందిస్తున్నామని చెప్తున్నా యజమాన్యం మరి
ఈ సమస్యల పట్ల నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు గత కొన్ని నెలల నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్న ఆరోఓ ప్లాంట్ ఇప్పటికీ పని చేయకపోవడం ఇది సివిల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కాదని ప్రశ్నించారు, కార్మికుల ఆందోళన సీఐటీయూ పోరాట ఫలితంగా గోదావరి ఖని ప్రాంతంలో దాదాపు పది ఆరోఓ ప్లాంట్లు శాంక్షన్ అయితే ఇప్పటికీ 4 నిర్మించారని అందులో మూడు నెలల తరబడి మూడు ఆరోఓ ప్లాంట్లు పని చేయకపోవడం ఇప్పటికీ రిపేరు నోచుకోకపోవడం సివిల్ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి పరిష్కరించకుంటే కార్మిక కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఆరేపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, వేణుగోపాల్ రెడ్డి, జెల్ల గజేందర్, జంగాపల్లి మల్లేష్, దాసరి సురేష్, జలగం సత్యనారాయణ, నంది నారాయణ, తిప్పారపు రాజు, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App