TRINETHRAM NEWS

Nalamada Uttam Kumar Reddy, Ministers of Water Drainage and Ayakattu Development Departments who attended the review meeting of the Chokkarao Devada Upliftment Project in Tupakulagudem

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని

తుపాకులగూడెం లోని చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలు ప్రాజెక్ట్ సమీక్ష సమావేశానికి విచ్చేసిన నీటి పారుదల మరియు ఆయాకట్టు అభివృద్ధి శాఖల మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు పంచాయతీ శాఖ, శిశు సంక్షేమశాఖల మంత్రివర్యులు ధనసరి అనసుర్య సీతక్క మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి స్వాగతం పలికిన

అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

ములుగు జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అనంతరం మంత్రి మరియు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో కలిసి చొక్కా రావు దేవాదుల ఎత్తిపోతలు ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పరీలించడం జరిగింది

అనంతరం ఎమ్మెల్యే సమీక్షలో మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని కోణాలచలం కెనాల్ మరమ్మతు చేస్తే నా వర్ధన్నపేట నియోజకవర్గానికి 3వేల ఎకరాల ఆయాకట్టుకు నీళ్లు అందుతాయి అని మంత్రి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విజ్ఞప్తి చేయటం జరిగింది

ఈ సమీక్ష సమావేశంలో మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, దొంతి మాధవరెడ్డి, హనుమామండ్ల యశ్వసిని ఝాన్సి రెడ్డి, భూక్యా మురళీ నాయక్, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రారామ్ రెడ్డి, నీటి పారుదల ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ నీటి పారుదల అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nalamada Uttam Kumar Reddy, Ministers of Water Drainage and Ayakattu Development Departments who attended the review meeting of the Chokkarao Devada Upliftment Project in Tupakulagudem