
అల్లూరి జిల్లా అరకు లోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 8: కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర బంద్ కు సమయత్వం అవ్వాలి అని పిలుపు. 1/70 చట్టము సవరించాలని అయ్యన్న మాటలపై స్పష్టమైన కూటమి ప్రభుత్వా వైఖరి ప్రకటించాలి. అరకు వేలి నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి!
మాట్లాడుతూ, ఆదివాసులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు చట్టాల పైన ఒక బాధ్యత గల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గౌరవ చింతకాయల అయ్యన్నపాత్రుడు 1/70 చట్టం గిరిజనుల కవచం లాంటి చట్టాన్ని చట్టం సవరించాలి గిరిజన ప్రాంతంలో త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ ను కట్టాలి. కోట్ల రూపాయల పెట్టుబడిదారులు రావటం లేదు అంటే 1/ 70 చట్టం అడ్డు వస్తుంది. అని వ్యాక్యాలు చేయటం చాలా దురదృష్టకరం దీనిని నిరసనగా ఈనెల 11 ,12 తేదీన మంగళవారం బుధవారం నాడు మన్యం రాష్ట్ర అఖిలపక్ష బందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము.
కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకముగా మరొక ఏ ఇతర రాజకీయ పార్టీ నుండి గాని ప్రభుత్వ అధికారి నుండి గాని ఆదివాసుల హక్కుల చట్టానికి జోలికి రాకుండా ఉండే విధంగా, వారికి గుండెల్లో రైలు ఇంజన్లు పరుగులెత్తించేవిధంగా ఉండాలి. అని గిరిజన ప్రజానికము విద్యార్థి సంఘము ఉద్యోగ సంఘము కార్మిక సంఘము ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీఅనుబంధ సంఘాలు ప్రతి ఒక్క గిరిజన పౌరుడు ఈ బందుకు హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్ రామ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బురిడీ దుక్కు కో రామచందర్ , సొట్ట సోమి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
