Chiluka Shankar is the general secretary of Pedpadelli District Contract Workers Union (IFTU).
ఆర్ ఎఫ్ సి ఎల్ కంపెనీలో పనిచేసే బ్యాగర్స్ & స్టిచ్చర్స్ కార్మికులకు 26 రోజుల పని దినం, చట్టబద్ధ హక్కులు కల్పించాలి
చిలుక శంకర్ ప్రధాన కార్యదర్శి పెద్దపెల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం (IFTU).
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపెల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం (IFTU) ఆధ్వర్యంలో ఆర్ ఎఫ్ సి ఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం (IFTU) జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారంలో సుమారు మూడు సంవత్సరాల నుండి కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.
కంపెనీలో కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఎరువుల ఉత్పత్తి చేసి దేశంలోని రైతాంగానికి సప్లై చేస్తూ వందల కోట్ల రూపాయలు లాభాలు గడిస్తున్నారు.
ముఖ్యంగా బ్యాగర్స్ & స్టిచ్చర్స్ కార్మికులకు ప్లాంట్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది.
ఇవేకాక ప్రభుత్వ జీవోల ప్రకారం కనీస వేతనాలు చట్టబద్ధ హక్కులు అమలు కావడం లేదని అన్నారు.
26 రోజులు పని దొరకడం లేదని చేసిన పనికి సరైన వేతనాలు రావడం లేదని అన్నారు.
ఈ యొక్క కార్మికుల సమస్యలపై అనేకసార్లు కంపెనీ యాజమాన్యాలకు కాంట్రాక్టర్లకు లేబర్ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోకుండా ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం మరియు కాంట్రాక్టర్స్ కార్మికుల శ్రమదోపిడికి పాల్పడుతున్నారు.
ఇప్పటికైనా ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం మరియు కాంట్రాక్టర్స్ ఈ కార్మికుల సమస్యలను పట్టించుకోవాలని కార్మికులకు 26 రోజుల పని దినాలు కల్పించాలని కనీస వేతనాల జీవో లను మౌలిక సదుపాయాలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అదే విధంగా ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం మరియు కాంట్రాక్టర్స్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ
రామగుండం నియోజకవర్గం శ్యాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ సమస్యలను ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం దృష్టికి తీసుకుపోయి మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఆర్ ఎఫ్ సి ఎల్. ఐ ఎఫ్ టి యు బ్రాంచి నాయకులు తిప్పని రాంకీ, కొండ్రా రూపేష్, ఆవుల రాకేష్, ముచ్చర్ల సతీష్ ,మానుక మధుకర్ ,మారం తిరుపతి సారం సంజీవ్, బొల్లం సంతోష్ పయ్యావుల శ్రీకాంత్, మల్యాల సతీష్, సారం సంజీవ్, ఆకుల రాకేష్, నల్గొండ సతీష్, వెంగళ శ్రీనివాస్, తాడూరు శ్రీకాంత్,వేణు,బైరీ రాకేష్,ఆకుల రమేష్,పల్లె శ్రావణ్,మారం తిరుపతి. తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App