TRINETHRAM NEWS

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ బాలల హక్కులు, విద్య మరియు పిల్లల సంక్షేమం గురించి అవగాహన పెంచడానికి భారతదేశంలో బాలల దినోత్సవాన్ని నవంబర్ 14న జరుపుకుంటామన్నారు. మన మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజున ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. నెహ్రూ కూడా పిల్లలపై అత్యంత ప్రేమ ఆప్యాయతలు చూపేవారు. ఫలితంగా పిల్లలు కూడా చాచానెహ్రుగా ఈయనను పిలిచేవారు. ఇతడి ఆధ్వర్యంలోనే 1954వ సంవత్సరంలో మొదటిసారిగా బాలల దినోత్సవం జరిగిందన్నారు నెహ్రూ పిల్లల విద్యాభివృద్ధికి మరియు సంక్షేమానికి కృషి చేశారని ఆయన్ని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, గానం మరియు ఇతర కార్యక్రమాలతో అలరించారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా పాటలు, ఉపన్యాసాలతో విద్యార్థులని ఆనందపరిచారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్ రెడ్డి,కోఆర్డినేటర్ నాగరాజు మరియు డీన్ లు, ఇంచార్జిలు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App