TRINETHRAM NEWS

గుంటూరు మార్కెట్‌ యార్డుకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం: చీఫ్ విప్ జీవీ

గుంటూరు మార్కెట్ యార్డు ప్రక్షాళన చర్యలపై సమీక్షలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ

Trinethram News : గుంటూరు మార్కెట్‌ యార్డ్‌కు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకుని రావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వచీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. రైతులు, వ్యాపారులు, అక్కడ పనిచేసే కూలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం గుంటూరు మార్కెట్ యార్డు ప్రక్షాళన, చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించిన సమీక్షలో జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ భార్గవ్, వ్యాపారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App