
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీలో 53, 54వ డివిజన్లకు సంబంధించి నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్ లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు. ముందుగా కేక్ కట్ చేసి నగర ప్రజల తరఫున ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్షేమం, అభివృద్ధి ప్రదాత, ప్రజల ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నిండునూరేళ్ళు పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలన్నారు. ఆ భగవంతుని, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ముఖ్యమంత్రికి వుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ సఫియా బేగం, దేవరకొండ సుజాత, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు షేక్ జమీర్, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనీల్ బాబు, వైఎస్ఆర్సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
