ఈనెల 4 న పెద్దపల్లిలో జరుగబోయే నిరుద్యోగ విజయోత్సవ సభకు పెద్ద ఎత్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలి…
నిరుద్యోగ విజయోత్సవ సభను విజయవంతం చేయాలి…
4 వ తారీఖున పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన..
గ్రూప్ 4 తో పాటు వివిధ పరీక్షలు ఎంపికైన 9 వేల మంది అభ్యర్థులకు సిఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత..
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
డిసెంబర్ 4 వ తేదీన పెద్దపల్లి లో జరుగబోయే నిరుద్యోగ విజయోత్సవ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి వస్తున్న సందర్బంగా పెద్ద ఎత్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
ఈనెల 4వ తేదీన పెద్దపల్లిలో జరుగబోయే నిరుద్యోగ విజయోత్సవ సభకు పెద్ద ఎత్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని 4 న జరగబోయే యువ వికాస బహిరంగ సభ ద్వారా ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి అవుతున్న సందర్బంగా గత 10 రోజుల నుండి అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేలందరు పాల్గొనడం జరుగుతుంది..
స్వర్గీయ ఇందిరా గాంధీ పేరు పై వరంగల్ లో మహిళా సభ మరియు మహబూబ్నగర్ లో రైతు వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో బహిరంగ సభ మరియు 4 వ తారీఖున పెద్దపల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువ వికాస బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది..
అలాగే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత ఉద్యోగకల్పనే ద్యేయంగా ముందుకు సాగుతుంది. గత ప్రభుత్వం లెక్క రైతులను మోసం చెయ్యలేదు.ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఔటర్ రింగురోడ్డు అమ్ముకొని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం నామమాత్ర రుణమాఫీ చేస్తే రైతులకు అప్పులకు సరిపోలేదు రైతుల విషయంలో నల్ల చట్టాలను అమలు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే కానీ ఇప్పుడు రైతుల పై మొసలి కన్నీరు కరుస్తున్నారని దమ్ము ధైర్యం ఉంటే రుణమాఫీ విషయం లో ఏ నాయకుడైనా రండి పెద్దపల్లి జిల్లా కు మేము నిరూపిస్తం ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ తప్పుడు ఆరోపణలు మానుకోవాలి అన్నారు.ఎలాంటి కటింగులు లేకుండా వడ్ల కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు 24 గంటలలో రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం.సన్న వడ్లకు రూ. 500 చొప్పున కూడా రైతుల ఖాతాల్లో వెంట వెంటనే ప్రభుత్వం జమ చేస్తున్నదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని ఓర్వలేక బి ఆర్ ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తుంది.అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ బి ఆర్ ఎస్ పార్టీనే బి ఆర్ ఎస్ పార్టీ బ్రోకర్ ముచ్చట్లు బంద్ చెయ్యండి,ఇప్పటికైనా నిజాలు చెప్పాలని అన్నారు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దాని కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి రైతు ప్రభుత్వమేనని అన్నారు యువకులు సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు ఎమ్మెల్యే అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App