TRINETHRAM NEWS

Changes in Group-1 Main Exam Timings!

30 నిమిషాల ముందుగానే పరీక్ష ప్రారంభం

మధ్యాహ్నం 2 గంటల నుంచే మొదలు

అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు

షెడ్యూల్‌ విడుదల చేసిన అధికారులు

హైదరాబాద్‌, ఆగస్టు 17 : గ్రూపు-1 మెయిన్‌ పరీక్షలను షెడ్యూల్‌ సమయం కంటే 30 నిమిషాల ముందుగానే ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ అధికారులు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. దాని ప్రకారం.. మెయిన్‌ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. గతంలో జారీ చేసిన వెబ్‌నోట్‌లో ఈ పరీక్షలను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని అని ప్రకటించగా తాజాగా స్వల్ప మార్పు చేశారు.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పర్సలైజ్డ్‌ ఆన్సర్‌ బుక్‌లెట్‌ను అందించాలని అధికారులు నిర్ణయించారు. అందులో అభ్యర్థి ఫోటోతో పాటు, ఇతర వివరాలు ముద్రించి ఉంటాయి. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా అభ్యర్థులకు నమూనా ఆన్సర్‌ బుక్‌లెట్‌ ఇవ్వనున్నారు. ఈనెల 17 నుంచి ఈ బుక్‌లెట్‌లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తారు. అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్ష విధానాన్ని ప్రాక్టీస్‌ చేసుకోవడంతో పాటు నిబంధనలను తెలుసుకోవచ్చు.

వీటితో పాటు హాల్‌టికెట్లపైన ఉన్న నిబంధనలను పరిశీలించుకోవాలని, వాటిని విరుద్ధంగా వ్యవహరిస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను హైదరాబాద్‌(హెచ్‌ఎండీఏ) పరిధిలోనే నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో భాగంగా ఇప్పటికే ప్రిలిమనరీ పరీక్షలు పూర్తిచేసి, ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అందులో ప్రతిభకనబరిచిన వారిని ఒక్కో పోస్టుకు 50 అభ్యర్థుల చొప్పున మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేశారు. ఇంటర్వ్యూలు లేకుండా పరీక్షల్లో చూపే ప్రతిభ ఆధారంగానే ఈ గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేయనున్నారు.

గ్రూపు-1 మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ వివరాలు

పరీక్ష పేరు తేదీ

జనరల్‌ ఇంగ్లీషు (క్వాలిఫై టెస్ట్‌) 21-10-2024

పేపర్‌-1 జనరల్‌ ఎస్సే 22-10-2024

పేపర్‌-2 చరిత్ర, కల్చర్‌ అండ్‌ జాగ్రఫీ 23-10-2024

పేపర్‌-3 ఇండియన్‌ సొసైటీ

రాజ్యాంగం-పాలన 24-10-2024

పేపర్‌-4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ 25-10-2024

పేపర్‌-5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 26-10-2024

పేపర్‌-6 తెలంగాణ మూవ్‌మెంట్‌ అండ్‌

స్టేట్‌ ఫార్మేషన్‌ 27-10-2024

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Changes in Group-1 Main Exam Timings!